ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తెలంగాణ

ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో 388 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాపై నిష్పక్షపాత విచారణ జరగాలి: నేమూరి శంకర్ గౌడ్

ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో 388 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాపై నిస్పక్షపాత విచారణ జరగాలి -బీఆర్ఎస్ పార్టీకి రూ. 1,400 కోట్లు “క్విడ్-ప్రో-కో” ద్వారా సమకూరాయని కేసీఆర్ కూతురు స్వయంగా చెప్పారు -ఫార్ములా-ఈ వ్యవహారంలో కేటీ

Staff Reporter20 September 2026, 7:08 AM8 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో 388 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాపై నిష్పక్షపాత విచారణ జరగాలి -బీఆర్ఎస్ పార్టీకి రూ. 1,400 కోట్లు “క్విడ్-ప్రో-కో” ద్వారా సమకూరాయని కేసీఆర్ కూతురు స్వయంగా చెప్పారు -ఫార్ములా-ఈ వ్యవహారంలో కేటీఆర్ పక్కదారి పట్టించిన రూ. 55 కోట్ల కేసు ఏమైంది? -నయీం కేసులో స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తులపై పూర్తి వివరాలు కావాలి -ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు పూర్తిగా బయటకు వెల్లడించాలి -కేసీఆర్ కుటుంబం 2014 ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తులు, ఈ రోజు ఉన్న ఆస్తుల లెక్క తేలాలి -తెలంగాణ ప్రజాధనం దోపిడి, పాలనా వ్యవస్థపై వచ్చిన ఆరోపణలన్నింటిపైనా సమగ్ర విచారణ జరపాలి -ప్రజలకు వాస్తవాలు తెలియాలి, దోషులు ఎవరైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి -జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 20: బీఆర్ఎస్ వద్ద సుమారు రూ.1,400 కోట్ల పార్టీ నిధులున్నాయని, అవి “క్విడ్-ప్రో-కో” వ్యవహారాల ద్వారా సమకూరాయని, బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత స్వయంగా చెప్పారు, “ఆ రూ. 1,400 కోట్ల మొత్తం ఏ ఖాతాల్లో ఉంది? ఏ కాలంలో సమకూరింది? దాని మూలాలు ఏమిటి? పార్టీ ఖాతాల్లోకి వచ్చిన నిధులకు సంబంధించిన ఆడిట్ రికార్డులు ఏమిటి? అని జనసేన పక్షాన ప్రశ్నిస్తున్నట్లు జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ స్పష్టం చేశారు.

హైదరాబాదులోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో శంకర్ గౌడ్ మాట్లాడుతూ, అమరుల బలిదానాలతో, విద్యార్థుల జీవితాలు నాశనం చేసుకుని, కవులు, కళాకారులు, ఉద్యోగులు, సబ్బండ వర్గాల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే వేల కోట్ల రూపాయలు నిధులు, వందల ఎకరాల భూములు దోచుకుని బాగుపడ్డారు, ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత పాలనకు సంబంధించిన భూములు, పార్టీ నిధులు, ప్రజాధనం, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఫార్ములా-ఈ వ్యవహారం, ప్రజాప్రతినిధుల ఆస్తుల పెరుగుదల తదితర అంశాలపై అనేక ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రజల ముందుకు వస్తున్నాయని శంకర్ గౌడ్ పేర్కొన్నారు.

ఈ ఆరోపణల్లో ఏవి నిర్ధారిత వాస్తవాలు, ఏవి రాజకీయ ఆరోపణలు, ఏవి చట్టపరంగా నిర్ధారణ కావాల్సిన అంశాలు అన్నది ప్రజలకు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లోని భూములపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు, సుమారు 700 ఎకరాల భూమిపై పరిశీలన జరుగుతోందని, అందులో 388 ఎకరాలు ప్రభుత్వ భూమి కావచ్చనే ఆరోపణలు ఉన్నాయని, భూముల అసలు యజమానులు ఎవరు? రిజిస్ట్రేషన్ రికార్డులు ఏమి చెబుతున్నాయి? ప్రభుత్వ భూమి ఏమైనా ప్రైవేటు ఆధీనంలోకి వెళ్లిందా? భూ బదలాయింపులు చట్టబద్ధంగా జరిగాయా? ప్రభుత్వ రికార్డులు, రిజిస్ట్రేషన్ రికార్డులు, పహాణీలు, ధరణి/భూ భారతి రికార్డుల్లో ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? అన్నింటినీ సమగ్రంగా పరిశీలించాలని జనసేన డిమాండ్ చేస్తోందని తెలిపారు.

భూమిలేని పేద దళిత మహిళలకు 3 ఎకరాల వ్యవసాయ భూమి అందిస్తామన్న హామీ తుంగలో తొక్కి, కేసీఆర్ కుటుంబం మాత్రం వందల ఎకరాలు దోచుకున్నట్లు ఆరోపించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలకు సంబంధించిన నిధుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన రూ. 400 కోట్లకు సంబంధించిన వ్యాఖ్యలపై విచారణ జరపాలని, ఆ మొత్తం ప్రభుత్వ నిధులా? ప్రైవేట్ నిధులా? ఏ సంస్థలకు? ఏ సంవత్సరాల్లో? ఏ అనుమతులతో? ఏ బ్యాంకు లావాదేవీల ద్వారా? అనే వివరాలను ప్రభుత్వం అధికారిక పత్రాలతో వెల్లడించాలన్నారు.

ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, నిధుల బదిలీలు తదితర అంశాల్లో అవసరమైన చోట సీబీఐ, హైకోర్టు పర్యవేక్షణలో సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో స్వతంత్ర విచారణ చేపట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని జనసేన పార్టీ తెలంగాణ పక్షాన, ప్రజల పక్షాన కోరుతున్నట్లు చెప్పారు. జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి సాగర్ ఆర్.కె. నాయుడు మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్, తెచ్చామని బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అన్నారు. భూముల సమస్యలు సృష్టించి, విద్యార్థుల ఫీజుల అంశంలో ఇబ్బందులకు గురి చేసి అట్లాడుతున్నారని అన్నారు.

ఇవి కూడా చదవండి

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం అప్లికేషన్ ప్రక్రియ ,పథకం అమలుపై చర్చ బీసీ గురుకులాలు, హాస్టల్ ల పనితీరుపై చర్చ

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం అప్లికేషన్ ప్రక్రియ ,పథకం అమలుపై చర్చ   బీసీ గురుకులాలు, హాస్టల్ ల పనితీరుపై చర్చ

Transport and BC Welfare Minister Ponnam Prabhakar held a high-level review meeting on the application process for the 'Intinta Indiramma Sewing Machines' scheme and the functioning of BC residential schools and hostels.

మిగతా చదవండి →

గన్‌పార్క్‌ వద్ద బీసీ సంఘాల నిరసన.. కులగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ పెట్టాలని డిమాండ్

గన్‌పార్క్‌ వద్ద బీసీ సంఘాల నిరసన.. కులగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ పెట్టాలని డిమాండ్

జనగణలో కునగనన కావాలి, ఓబీసీలకు ప్రత్యేక కాలం చేపట్టలని, ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే ఓబీసీలకు కులాల వారీగా జన గనన చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బిసి పొలిటికల్ ప్రింట్ సంయుక్త ఆధ్వర్యంలో గన్ పార్క్ లోని అమరవీర

మిగతా చదవండి →