ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

రాజీనామా చేయాల్సింది ఎవరు? రూపాయి జీతం తీసుకొని పేదలకోసం పనిచేస్తున్న నేను రాజీనామా చేయలా?

Minister Ponguleti Srinivasa Reddy hit out at Harish Rao over allegations regarding 22A lands, questioning if KCR should resign instead.

nagendra13 September 2026, 2:56 AM3 చూసులుtrinetnews.com
రాజీనామా చేయాల్సింది ఎవరు?  రూపాయి జీతం తీసుకొని పేదలకోసం పనిచేస్తున్న నేను రాజీనామా చేయలా?

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

రూ. 21 కోట్లు తీసుకొని అసెంబ్లీకి రాకుండా ఫార్మ్ హౌస్ లో ఉన్న కే.సీ.ఆర్. రాజీనామా చేయలా?

అధికారంలో ఉంటే అవినీతి.. ప్రతిపక్షంలో ఉంటే బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలా?

‘పొంగులేటి.. పొంగు’ అంటూ ఎందుకు భయపడుతున్నారు?

మాజీ మంత్రి హరీష్ రావు ను ప్రశ్నించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 12 : 22ఏ భూముల అంశాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటే.. అసత్య ప్రచారాలతో ప్రభుత్వాన్ని, తనను లక్ష్యంగా చేసుకోవడం ఎందుకని ప్రశ్నించారు.

“చీము, నెత్తురు, సిగ్గు, శరం ఉంటే రాజీనామా చేయాలని నన్ను అడుగుతున్నారు. మరి ప్రజాధనంతో ఇన్నేళ్లు అధికారాన్ని అనుభవించి.. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన వారు రాజీనామా చేయాల్సింది కాదా?” అని మంత్రి నిలదీశారు.

తాను ప్రతి నెల ఒక్క రూపాయి జీతం మాత్రమే తీసుకుంటూ, పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ టవర్స్ నిర్మాణంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు. “ప్రజల కోసం పనిచేస్తున్న నన్ను రాజీనామా చేయమంటారా?” అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి 21 కోట్ల రూపాయలు పొంది అసెంబ్లీకి ప్రజలకు మొఖం చాటేసిన కే.సీ.ఆర్. రాజీనామా చేయాలా? అని హరీష్ రావును ప్రశించారు.

అధికారంలో ఉంటే అవినీతి.. ప్రతిపక్షంలో ఉంటే బ్లాక్‌మెయిల్?

“అధికారంలో ఉంటే అవినీతి.. ప్రతిపక్షంలో ఉంటే బ్లాక్‌మెయిల్. ఇప్పుడు చేస్తున్నది కూడా అదే. మీ బ్లాక్‌మెయిల్‌కు, తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రభుత్వం ఇది కాదు” అని స్పష్టం చేశారు.

‘పొంగులేటి.. పొంగు’ అంటూ ఎందుకు భయపడుతున్నారు?

తన పేరును పదేపదే ప్రస్తావిస్తూ ‘పొంగులేటి.. పొంగు’ అంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు.

“పొంగులేటి.. పొంగు అని ఎందుకు పదేపదే అంటున్నారు? ఎందుకు అంత భయం? శుభకార్యంలో పాలు పొంగితే శుభం. కానీ గోదావరి, కృష్ణా నదులు ఉగ్రరూపంలో పొంగితే ఆ పొంగులో మీరే కాదు.. మీ పార్టీ కూడా నామరూపాలు లేకుండా పోతుంది” అని వ్యాఖ్యానించారు. కే.సీ.ఆర్. క్రింద పోర్లడినా మరోసారి ముఖ్యమంత్రి కాలేరని ఆనాడు ఖమ్మం సభలో నేను చెప్పినట్లుగానే వచ్చే ఎన్నికల్లో కూడా ఈ సభలో కుర్చేనిది కూడా ఇందిరమ్మ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →