ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

Understanding True Character: Power and Opportunity Reveal Who We Are

True character is revealed not through words, but when a person is given power and opportunity. Power does not change a person; it merely brings out their hidden nature.

nagendra26 August 2026, 3:00 AM5 చూసులుtrinetnews.com
Understanding True Character: Power and Opportunity Reveal Who We Are

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

గుణం

ఒకరి గుణగణాలు

పరీక్షించి చూడాలంటే

మాటలతో కాదు

ఒక అవకాశం ఇచ్చి చూడాలి

నమ్మకం ఉంటే అధికారం

అప్పగించి చూడాలి

అప్పుడు అతని మనసులోని

నిజమైన స్వభావం తెలుస్తుంది

చేతిలో అధికారం వచ్చాక

ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడాలి

తనకంటే చిన్నవారిని

ఎలా గౌరవిస్తున్నాడో గమనించాలి

అవకాశం లేనప్పుడు మంచివాడిలా

ఉండడం పెద్ద విషయం కాదు

అవకాశం వచ్చినప్పుడు కూడా

మంచితనాన్ని కాపాడుకోవడమే గొప్పతనం

అధికారం మనిషిని మార్చదు

అతనిలో దాగి ఉన్న గుణాన్ని

బయటకు తీసుకువస్తుంది

డబ్బు కూడా అదే నిజాన్ని చెబుతుంది

ఎదుటివాడి బలహీనత తెలిసినా

దాన్ని ఉపయోగించుకోకుండా ఉంటే

అతని మనసు మంచిదని అర్థం

అదే అసలైన వ్యక్తిత్వానికి నిదర్శనం

అవకాశం ఇచ్చినప్పుడు

అతను ఎదుగుతాడా

లేక ఎదుటివారిని తొక్కి

తాను ఎదగాలని చూస్తాడా

అదే అతని అసలు గుణం

అదే అతని నిజమైన విలువ

పదవి కాదు మనిషిని గొప్పవాడిని చేసేది

ఆ పదవిలో ఉన్నప్పుడు అతని ప్రవర్తనే గొప్పతనం.

రచన : గుదే సుబ్బారావు

ఉపాధ్యాయుడు, మాధవరం, పశ్చిమ గోదావరిజిల్లా.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →