ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

తెలుగు వర్సిటీ లో 50% రాయితీ తో పుస్తక ప్రదర్శన

Suravaram Pratapareddy Telugu University is organizing a book exhibition with a 50% special discount from September 15 to October 3.

nagendra11 September 2026, 12:53 AM16 చూసులుtrinetnews.com
తెలుగు వర్సిటీ లో 50% రాయితీ తో పుస్తక ప్రదర్శన

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

తెలుగు యూనివర్సిటీ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 10:

తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు , పరిశోధకులకు , సాహిత్యాభిమానులకు ఉపయోగపడేలా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం 50 శాతం ప్రత్యేక రాయితీ తో పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నారు. నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న తరతరాల తెలుగు జాతి మ్యూజియంలో ఈ పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు.

సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 3 వరకు కొనసాగనున్న ఈ పుస్తక ప్రదర్శన కార్యాలయ పనిదినాలలో ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుస్తకాల విక్రయం ఉంటుందని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. ఈ ప్రదర్శనలో తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు, జానపదం తదితర అంశాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉండనున్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన పుస్తకాలతో పాటు వివిధ అంశాలపై పరిశోధన చేసిన ప్రముఖుల సిద్ధాంత గ్రంథాల ప్రచురణలు కూడా విద్యార్థులు, పరిశోధకులకు ఉపయోగపడేలా ఒకే చోట లభ్యం కానున్నాయి. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడంతో పాటు తెలుగు సాహిత్యాన్ని మరింత విస్తృతంగా పాఠకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు , హైదరాబాద్‌ నగరంలోని తెలుగు సాహిత్యాభిమానులు, విద్యార్థులు, పాఠకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రిజిస్ట్రార్ విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →