ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

పాటీమట్ల జడ్పీహెచ్ఎస్ యందు నీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన కానుగంటి శ్రీశైలం

NEED NGO celebrated Teacher's Day at Patimatla ZPHS, paying tribute to Dr. Sarvepalli Radhakrishnan and honoring local educators.

nagendra10 September 2026, 1:45 AM2 చూసులుtrinetnews.com
పాటీమట్ల జడ్పీహెచ్ఎస్ యందు నీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం  సర్వేపల్లి రాధాకృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన కానుగంటి శ్రీశైలం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి,సెప్టెంబరు09:

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో బుధవారం రోజు నీడ్(NEED)స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కానుగంటి శ్రీశైలం మాట్లాడుతూ నేటి విద్యార్థులే తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి ఉన్నత స్థానం చేరుకున్న తర్వాత వారి బాగోగులను చూసుకునే బాధ్యత విద్యార్థులదేనని వారే తల్లిదండ్రులకు, దేశానికి నిజమైన సంపదని అన్నారు. స్థానిక సర్పంచ్ బండ రమా విజయ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగిస్తూ ఇక ప్రతి సంవత్సరం మన పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్యను పెంచడానికి ప్రధాన పాత్ర పోషిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మిర్యాల దామోదర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత దర్శనం వెంకన్న (తెలుగు ఉపాధ్యాయులు)ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మరియు ఉపాధ్యాయులు, అలాగే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులను మరియు ఉపాధ్యాయులను, అంగన్వాడీ టీచర్ పుష్పలతను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాటిమట్ల ఉపాధ్యాయ ఉపాధ్యాయిని బృందం ఎం లింగమల్లు,జి వెంకటేశ్వర్లు,బండారు మల్లయ్య,వంగూరి యాదయ్య,పిడి చిరుమర్తి యాదయ్య,ఎర్ర శంకర్, తిరుపతి నాయక్,వి కృష్ణవేణి, స్కోప్ స్వచ్ఛంద సంస్థ మండల కోఆర్డినేటర్ కురిమేటి యాదయ్య,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. ప్రవీణ్ కుమార్,ఉపాధ్యాయిని వినీత,విద్యార్థినీ విద్యార్థులు, స్కావెంజర్ యాదయ్య పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →