ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

Supreme Court Emphasizes Robust Protection for Minors on Social Media

సోషల్ మీడియా వేదికలను వినియోగించే మైనర్ల భద్రతపై పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పద్దెనిమిదేళ్లలోపు పిల్లలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను వాడేటప్పుడు తల్లిదండ్రుల అనుమతి లేదా ఈకేవైసీ తప్పనిసరి చేసే నిబంధనలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

nagendra13 September 2026, 2:30 AM1 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

స్టోరీ మైనర్లకు సోషల్ మీడియాను నియంత్రించాలి

*పటిష్టమైన రక్షణ వ్యవస్థ అవసరం

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 12:

సోషల్ మీడియాతో పాటు ఇతర డిజిటల్ ప్లాట్ ఫామ్ లు వినియోగించే పిల్లల భద్రతకు మరింత పటిష్టమైన రక్షణ వ్యవస్థ అవ సరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. భారతీయ ఒప్పంద చట్టం ప్రకారం, 18 ఏళ్లలోపు మైనర్లు స్వతంత్రంగా ఎలాంటి ఒప్పందాలు చేసుకోవడానికి చట్టపరంగా అర్హులు కానందున, డిజిటల్ ప్లాటీ ఫాన్లు వారితో ప్రైవసీ పాలసీలు, సర్వీస్ టర్మ్స్ ను ఒప్పందాలు చేసుకోకుండా అవసరమైన నియంత్రణలు తీసుకోవాల్సిన అగత్యం ఉన్నదని సూచించింది. కాస్ట్ రైల్స్ ఫర్ చిబ్ర అలయన్స్' అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మార్కి బాగ్స్, జస్టిన్ మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్ ర్ సంస్థ తరపున న్యాయవాది హెచ్ఎస్. పూల్యా వాదనలు వినిపించారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ వయసు నిబంధనలు, భారత చట్టాల మధ్య ఉన్నవ్యత్యాసాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఫేస్ బుక్, స్నాప్ చాట్ వంటి కొన్ని ప్లాట్ ఫామ్ ఏళ్ల వయసు నుంచే ఐకౌంట్లు ఓపెన్ చేసే అవకాశం కల్పిస్తున్నా యని పేర్కొన్నారు. భారత చట్టాల ప్రకారం 18 ఏళ్లలోపు వారందరినీ మైనర్లుగా పరి గణిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో పిల్లలు డిజిటల్ ప్లాట్ఫామ్లలోకి ప్రవేశం చినప్పుడు వారి వయసును సక్రమంగా నిర్ధారించడం, వారి వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడం. ప్రమాదకర కంటెంట్ నుంచి వారిని కాపాడటం వంటి అంశాలపై స్పష్టమైన నియమాలు అవసరమని చెప్పారు. సెక్సువల్ ఎక్స్ ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియలకు సంబంధించి దేశంలో కఠినమైన శిక్షా నిబంధనలు ఉన్న సమర్థంగా

అమలు చేయడంలో డిజిటల్ వేదికలు విఫలమవుతున్నాయని చెప్పారు. పిల్లలకు సంబంధించిన అభ్యంతరకర కంటెంటు గుర్తించి తొలగించేందుకు ఆటోమేటెడ్ కంటెంట్ ఫిల్డరింగ్ వ్యవస్థలను విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.దాంతోపాటు వయసును నిర్దారించే సమర్థ మైన విధానం ఉండాలన్నారు.

తల్లిదండ్రుల అనుమతి అవసరం...

18 ఏళ్లలోపు పిల్లలతో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఎలాంటి అంగీకారం కుదుర్చు కోకుండా నిబంధనలు రూపొందించాలని సీజేఐ సూచించారు. ఒక మైనర్ డిజిటల్ సేవలను వినియోగించాల్సిన పరిస్థితి ఉంటే తల్లిదండ్రులు, లేదా చట్టబద్ద సంరక్షకుడి అనుమతి తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. అలాంటి అనుమతి ఇచ్చే వ్యక్తి నిజంగా తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకుడేనా అన్నది గుర్తింపు ధ్రువీకరణ లేదా ఈకేవైసీ ద్వారా నిర్ధారించే విధానం ఉండాలన్నారు. ఇందుకోసం 2021లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమాల్లో మార్పులు చేయాలని చెప్పారు. లేనిపక్షంలో ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం 18ఏళ్లలోపు సయసు ఉన్న పిల్లల సోషల్ మీడియా ఇతర డిజిటల్ ప్లాట్ ఫాంలకు వినియోగించే సమయంలో వారి భద్రత అంశంపై సమగ్ర వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →