మంగళవారం10 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,107+5.45%
NIFTY25,045+5.18%
22K₹1,31,677/10g-0.73%
భాషలు

తాజా వార్తలు

"భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి" బయోపిక్ మరో శంకరాభరణం అవుతుంది - సూపర్ స్టార్ రజనీకాంత్

nagendra15 October 2026, 2:43 AM3 చూసులుtrinetnews.com
"భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి" బయోపిక్ మరో శంకరాభరణం అవుతుంది - సూపర్ స్టార్ రజనీకాంత్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

తన అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి, గాయని భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్రను "భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి" సినిమాగా నిర్మిస్తున్నారు విజనరీ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఎంఎస్ సుబ్బులక్ష్మిగా నేషనల్ క్రష్ రశ్మిక మందన్న నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సెప్టెంబర్ లో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ చేతుల మీదుగా "భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి" సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. తాజాగా ఈ సినిమాకు మరో లెజెండ్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు లభించాయి. "భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి" సినిమా తెరకెక్కడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ సినిమా మరో శంకరాభరణం అవుతుందని రజనీకాంత్ రీసెంట్ గా జరిగిన జైలర్ 2 సినిమా ఈవెంట్ లో చెప్పారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించడంపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాను స్క్రీన్ మీద చూసేందుకు తాను వేచి చూస్తున్నట్లు రజనీకాంత్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య