ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

బడిపిల్లల కష్టాలు తీర్చిన సర్పంచ్ 'సైకిల్' బాసట! మాట నిలబెట్టుకున్న సర్పంచ్ నాతాల వెంకట్‌రెడ్డి

Gajula Malkapuram Sarpanch Nathaala Venkat Reddy won praise by donating bicycles from his own pocket to poor students struggling to walk long distances to school.

nagendra10 September 2026, 1:49 AM3 చూసులుtrinetnews.com
బడిపిల్లల కష్టాలు తీర్చిన సర్పంచ్ 'సైకిల్' బాసట!  మాట నిలబెట్టుకున్న సర్పంచ్ నాతాల వెంకట్‌రెడ్డి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

నలుగురు విద్యార్థులకు సొంత ఖర్చులతో సైకిళ్ల పంపిణీ

"ప్రతి ఏటా ఉచితంగా సైకిళ్లు అందిస్తా" - సర్పంచ్ సరికొత్త హామీ

ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి అరుదైన చొరవ

సూర్యాపేట, పెన్ పహాడ్, ట్రైనెట్ న్యూస్ , సెప్టెంబర్ 9:

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ స్థానిక సర్పంచ్ నాతాల వెంకట్‌రెడ్డి అరుదైన ఉదారతను చాటుకున్నారు. మండల పరిధిలోని గాజుల మల్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పాఠశాలలో చదవడానికి ప్రతిరోజూ సుమారు 7 కిలోమీటర్ల దూరం నుండి కాలినడకన ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న నలుగురు పేద విద్యార్థులను సర్పంచ్ గుర్తించారు. రవాణా కష్టాల వల్ల విద్యార్థులు బడికి దూరం కాకూడదనే ఉద్దేశంతో, ఒక్కొక్కటి రూ. 6,000 చొప్పున మొత్తం రూ. 24,000 విలువైన నాలుగు సైకిళ్లను తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసి బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాతాల వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దూర భారం వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగిపోకూడదనే ఈ చిన్న సహాయం చేశానని తెలిపారు. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా దూరం నుండి వచ్చే పేద విద్యార్థులను గుర్తించి, వారికి సొంత ఖర్చులతో సైకిళ్లను పంపిణీ చేస్తానని ఈ వేదికగా ఆయన సంచలన హామీ ఇచ్చారు. భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు మరింత కృషి చేస్తానని స్పష్టం చేశారు. హెచ్‌ఎం చేకూరి అంజయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల కష్టాన్ని గుర్తించి సకాలంలో స్పందించిన సర్పంచ్ చొరవ అందరికీ స్పూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండి రామకృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి లావణ్య, డాక్టర్ కవిత, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు మంజుల, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శ్రీరాములు, విద్యార్థుల తల్లిదండ్రులు భూక్య వెంకటేశ్వర్లు, గుగులోతు సురేష్, వెంకన్న, నిర్మల, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →