ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

మాస్ కమ్యూనికేషన్‌ లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన ప్రాన్షుత..

Dasi Pranshutha bagged two gold medals in Mass Communication and Journalism at Osmania University's 85th convocation.

nagendra9 September 2026, 1:50 AM7 చూసులుtrinetnews.com
మాస్ కమ్యూనికేషన్‌ లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన ప్రాన్షుత..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఉస్మానియా యూనివర్సిటీ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 8 :

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగంలో దాసి ప్రాన్షుత రెండు స్వర్ణ పతకాలు సాధించారు. మంగళవారం నిర్వహించిన ఓయూ 85వ స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్‌, ఓయూ చాన్స్ లర్ చేతుల మీదుగా ఆమె స్వర్ణ పతకాలు, అవార్డులను అందుకున్నారు. ఈ ఘనతతో ఆమె కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. పెద్దపల్లి జిల్లా కూనారం గ్రామానికి చెందిన ప్రాన్షుత ఉత్తరప్రదేశ్‌ లోని గోరఖ్‌పూర్‌లో జన్మించారు. బెంగళూరు, వరంగల్‌ లోని కేంద్రీయ విద్యాలయాల్లో విద్యాభ్యాసం చేసిన ఆమె పదో తరగతి, ఇంటర్మీడియట్‌ లో టాపర్‌గా నిలిచారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయం (బిఏఎంయూ) లో గ్రాడ్యుయేషన్‌ లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి టాపర్‌గా నిలిచారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ప్రాన్షుత మాజీ భారత వైమానిక దళ అధికారి దాసి ప్రభాకర్, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కల్పన దంపతుల కుమార్తె. దాసి ప్రభాకర్ భారత వైమానిక దళంలో సేవలందించడంతో పాటు కార్గిల్‌ యుద్ధంలోనూ పాల్గొన్నారు. దేశానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన పతకం అందుకున్నారు. తమ కుమార్తె రెండు స్వర్ణ పతకాలు సాధించడం కుటుంబానికి ఎంతో గర్వకారణమని తల్లిదండ్రులు తెలిపారు. ప్రాన్షుత సాధించిన విజయం క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →