సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 17: చిలకలగూడ మైలార్‌గడ్డలో ఇమ్మడి శ్రీనివాస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో భోలక్‌పూర్‌కు చెందిన మహమ్మద్ నిజాముద్దీన్ అలియాస్ నిజాం (36) ను చిలకలగూడ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం 6 నుంచి 6.30 గంటల మధ్య శ్రీనివాస్ తన యాక్టివాపై సమీపంలోని వైన్ షాప్ కు వెళ్లాడు. రాత్రి 7.10 నుంచి 7.20 గంటల సమయంలో మైలార్‌గడ్డ రోడ్డుపై నిజాముద్దీన్ కత్తితో శ్రీనివాస్ పై దాడి చేసి పరారైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ను తొలుత ఆర్టిసి ఆసుపత్రికి, అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు సుమన్ తో నిందితుడికి పరిచయం ఉండటంతో పాటు వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో నష్టాల కారణంగా సుమన్ అప్పులు చేసి 2023 నవంబర్ లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తనకు రావాల్సిన డబ్బు చెల్లించాలని నిజాముద్దీన్ డిమాండ్ చేయడంతో పాటు, ఆర్థిక వివాదంపై సివిల్ కేసు కూడా దాఖలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ పై దాడి జరిగినట్లు పేర్కొన్నారు. నిందితుడి నుంచి నేరానికి ఉపయోగించిన పదునైన వంకర కత్తి, రక్తపు మరకలున్న దుస్తులు ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ ఎస్ హెచ్ ఓ వి. రామకృష్ణ, ఎస్ఐ జె. రాకేష్, వారి బృందాలు ఏసీపీ కె. శశాంక్ రెడ్డి పర్యవేక్షణలో, అదనపు డీసీపీ జె. నర్సయ్య నాయకత్వంలో దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ రక్షిత కృష్ణ మూర్తి, తెలిపారు. ఆర్థిక, వ్యక్తిగత వివాదాలను చట్టబద్ధమైన మార్గాల్లోనే పరిష్కరించుకోవాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
మైలార్‌గడ్డ హత్య కేసు ఛేదించిన పోలీసులు..
Chilakalguda police arrested a 36-year-old man in connection with the murder of Immadi Srinivas over financial disputes in Mylargadda.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర
మిగతా చదవండి →జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక
మిగతా చదవండి →స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,
మిగతా చదవండి →తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద
మిగతా చదవండి →