ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

కష్టాలను దాటి.. డాక్టరేట్ సాధించిన ఆంజనేయులు

Kukudala Anjaneyulu, Chairman of Sri Shloka Schools from Halia, has been awarded a doctorate from Osmania University.

nagendra9 September 2026, 1:42 AM5 చూసులుtrinetnews.com
కష్టాలను దాటి.. డాక్టరేట్ సాధించిన ఆంజనేయులు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

కష్టాలను దాటి.. డాక్టరేట్ సాధించిన ఆంజనేయులు

నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్

హాలియా: హాలియా ప్రాంతానికి చెందిన విద్యావేత్త, శ్రీ శ్లోకా స్కూల్స్ చైర్మన్ కుకుడాల ఆంజనేయులు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకుని అరుదైన ఘనత సాధించారు.

హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా ఆంజనేయులు డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి కుమార్ ములుగారం తదితరులు పాల్గొన్నారు.

వాణిజ్య శాస్త్ర విభాగంలో పరిశోధన పూర్తి చేసినందుకు ఆంజనేయులకు ఈ డాక్టరేట్ లభించింది. ఈ ఘనత పట్ల ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, విద్యావేత్తలు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

హాలియా ప్రాంతానికి చెందిన ఆంజనేయులు సామాజికంగా వెనుకబడిన వర్గానికి చెందిన సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఎన్నో కష్టాలను అధిగమిస్తూ విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. పట్టుదల, కృషి, విద్యపై ఉన్న ఆసక్తితో ఉన్నత స్థాయికి ఎదిగి ప్రస్తుతం శ్రీ శ్లోకా స్కూల్స్ చైర్మన్‌గా విద్యారంగంలో సేవలందిస్తున్నారు.

సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ సాధించే స్థాయికి చేరుకోవడం యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థిక, సామాజిక పరిమితులు ఉన్నప్పటికీ పట్టుదలతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆంజనేయుల విజయగాథ నిరూపిస్తోందన్నారు.

డాక్టరేట్ సాధించిన కుకుడాల ఆంజనేయులను పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందించారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →