ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

దళితులు నడిచిన నేలను బి.ఆర్.ఎస్ శుద్ధి చేయడం దారుణం: ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి..

OU JAC Chairman Kothapalli Tirupati expressed outrage over BRS leaders sprinkling turmeric water where Dalits walked near the former CM's farmhouse.

nagendra11 September 2026, 1:07 AM2 చూసులుtrinetnews.com
దళితులు నడిచిన నేలను బి.ఆర్.ఎస్ శుద్ధి చేయడం దారుణం: ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఉస్మానియా యూనివర్సిటీ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 10 :

మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ వద్దకు దళితులు వచ్చారనే కారణంతో బీఆర్‌ఎస్‌ నాయకులు పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయడాన్ని ఓయూ జేఏసీ చైర్మన్‌ కొత్తపల్లి తిరుపతి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఘటనను నిరసిస్తూ గురువారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ దళితులను చిన్నచూపు చూడటం, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం ప్రజాస్వామ్య సమాజంలో సరికాదన్నారు. ఇలాంటి చర్యలు సామాజిక సమానత్వానికి విరుద్ధమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కేటీఆర్‌, హరీష్‌ రావు ను ఓడిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా దళిత స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కొత్తపల్లి తిరుపతి తెలిపారు. ప్రజా ప్రతినిధుల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. తక్షణమే బీఆర్‌ఎస్‌ నాయకులు దళిత సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌, రమేష్‌, రాజేందర్‌, చరణ్‌, స్వామి అరుణ్‌, ఆకాష్‌, కుశాల్‌, ఆంజనేయులు, వెంకటేష్‌, అఖిల్‌, రాజు, సాయి, రాము, శివ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →