ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

సెప్టెంబర్ 8న ఓయూ 85వ స్నాతకోత్సవం..

OU is gearing up for its 85th convocation on September 8, where 640 research degrees and 71 gold medals will be awarded, with Governor C.P. Radhakrishnan (acting as Chancellor) presiding and Bharat Biotech Chairman Dr. Krishna M. Ella as chief guest.

nagendra3 September 2026, 8:40 PM8 చూసులుtrinetnews.com
సెప్టెంబర్ 8న ఓయూ 85వ స్నాతకోత్సవం..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

* 640 పరిశోధనా డిగ్రీలు.. 71 బంగారు పతకాలు ప్రదానం..

* ఛాన్స్ లర్ హోదాలో హాజరుకానున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా..

తార్నాక, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 3 :

తెలంగాణ రాష్ట్ర విద్యావీచికగా పేరొందిన ఉస్మానియా విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. సెప్టెంబర్‌ 8న ఉదయం 9 గంటలకు ఓయూ ఠాగోర్‌ ఆడిటోరియంలో స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్‌ కుమార్‌ మొలుగరం తెలిపారు. ఓయూ అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జి. నరేష్‌ రెడ్డి, ఓఎస్‌డీ ప్రొఫెసర్‌ ఎస్‌. జితేంద్ర కుమార్‌ నాయక్‌, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ సుధాకర్‌ రెడ్డితో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌, ఓయూ కులపతి శివ ప్రతాప్‌ శుక్లా స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించనుండగా.. భారత్‌ బయోటెక్‌ వ్యవస్థాపకులు, ఛైర్మన్‌ డా. కృష్ణ ఎం. ఎల్లా ముఖ్య అతిథిగా హాజరై స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నారు. విశ్వవిద్యాలయంలోని 12 పీఠాలకు (ఫ్యాకల్టీ లకు) చెందిన వివిధ విభాగాల విద్యార్థులు, పరిశోధకులకు మొత్తం 640 పరిశోధనా డిగ్రీలు (పిహెచ్‌డీలు) ప్రదానం చేయనున్నారు. ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 71 బంగారు పతకాలు అందజేయనున్నారు.

క్రమశిక్షణకు పెద్దపీట.. ప్రత్యేక ఏర్పాట్లు..

స్నాతకోత్సవాన్ని విశ్వవిద్యాలయ ప్రతిష్టకు తగ్గట్టుగా ఘనంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు బోధన, బోధనేతర సిబ్బంది, వివిధ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయని వీసీ తెలిపారు. డిగ్రీ, బంగారు పతక గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులు, ప్రముఖులు, స్పాన్సర్లు, మీడియా కోసం ప్రత్యేక సీటింగ్‌, పార్కింగ్‌ సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.

ప్రత్యక్ష ప్రసారం.. ప్రత్యేక సెల్ఫీ పాయింట్లు..

కార్యక్రమాన్ని యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, అధికారిక లింక్‌ ను ముందుగానే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఆడిటోరియంలో అధికారికంగా అనుమతించిన విశ్వవిద్యాలయ ఫోటోగ్రఫీ, వీడియో చిత్రీకరణకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోల కోసం ప్రధాన కార్యక్రమ ప్రాంతమైన ‘వెల్‌’ లోకి ప్రవేశించరాదని సూచించారు. విద్యార్థులు, పరిశోధకులు, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక ఫోటోగ్రఫీ, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్నాతకోత్సవ అధికారిక ఛాయాచిత్రాలను అనంతరం ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →