ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

: సోమవారం నాడు నవ్య నాటక సమితి "హంసధ్వని" శిక్షణా శిబిరం పోస్టర్ ను ఆవిష్కరించిన డా. దుడ్డు పావని, వేమరాజు విజయ కుమార్, నిష్ఠల సుధామాల తదితరులు.

Dr. Duddu Pavani, Vemaraju Vijay Kumar, and others unveiled the poster for the 'Hamsadhwani' music research training camp on Monday.

nagendra24 August 2026, 8:32 PM5 చూసులుtrinetnews.com
: సోమవారం నాడు నవ్య నాటక సమితి "హంసధ్వని" శిక్షణా శిబిరం పోస్టర్ ను ఆవిష్కరించిన డా. దుడ్డు పావని, వేమరాజు విజయ కుమార్, నిష్ఠల సుధామాల తదితరులు.

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హంసధ్వని" సంగీత పరిశోధనా అంశాల శిక్షణా శిబిరం ఆగస్టు 29 నాడు.

సుప్రసిద్ధ సాంస్కృతిక సంస్థ నవ్యనాటక సమితి ఆధ్వర్యంలో

"హంసధ్వని" సంగీత పరిశోధన అంశాల రూపకల్పన లో శిక్షణా శిబిరం ఈనెల 29వ తేదీనాడు నిర్వహింపబడుతుందని సమితి అధ్యక్షుడు వేమరాజు విజయకుమార్, సమన్వయకర్తలు నిష్టల సుధామాల, డాక్టర్ ఇందిరా హేమలు తెలియజేసారు.

ఈ కార్యక్రమానికి చెందిన పోస్టర్ ను

సోమవారం నాడు సమితి కార్యాలయంలో ప్రముఖ సంగీత విద్వాంసురాలు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సంగీత విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్

డా. పావని దుడ్డు, సమితి సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ శిబిరంలో సంగీత పరిశోధనా రంగంలో కొత్తగా అడుగుపెట్టిన విద్యార్థులు, అధ్యాపకులు, మరియు ఆసక్తిగల పరిశోధకులకు విశ్లేషణాత్మక ఆలోచన, సరైన శోధనా అంశాల ఎంపిక, పరిశోధనా విధానాలు, మరియు సమాచార సేకరణ విధానాలు వంటి అంశాలపై ప్రాముఖ్యతనిచ్చి వివరంగా అవగాహన కల్పించబడుతుందని

నిష్ఠల సుధామాల తెలిపారు.

ఈ వర్క్‌షాప్‌ను డా. పావని దుడ్డు గారు ఇంటరాక్టివ్ సెషన్‌గా నిర్వహిస్తారు. ఈ సెషన్‌లో పాల్గొనేవారు పరిశోధనా విషయ అభివృద్ధి ప్రక్రియను సవివరంగా అర్థం చేసుకోవడమే కాకుండా, ఆలోచనలు, సూత్రీకరణ, పరిశోధనా ప్రశ్నలు, లక్ష్యాలు, మరియు సాహితీ సమీక్షపై అవగాహన పొందడం, మరియు పరిశోధనా విషయం తుది రూపుదిద్దుకునే విధానాలను నేర్చుకోవచ్చు. శాస్త్రీయ పరిశోధనలో ప్రామాణికత, ప్రాముఖ్యత, మరియు వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడానికి ఇది మంచి అవకాశం.

ఈ ఇంటరాక్టివ్ వర్క్‌షాప్ పరిశోధనా విషయాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు రూపొందించబడిందని విజయ కుమార్ వివరించారు.

వేమరాజు రమాదేవి, శృతి వారణాసి, యశస్విని పొన్నలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →