ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ జనరల్ సెక్రటరీ ర్యాల రాజేందర్ యాదవ్.

Secunderabad DCC General Secretary Ryala Rajender Yadav called for the grand success of the special voter list revision program during a camp in Mettuguda.

nagendra8 September 2026, 1:41 AM6 చూసులుtrinetnews.com
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ జనరల్ సెక్రటరీ ర్యాల రాజేందర్ యాదవ్.

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్ ట్రైన్ నైట్ న్యూస్సికింద్రాబాద్, సెప్టెంబర్ 7:

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ర్యాల రాజేందర్ యాదవ్ పిలుపునిచ్చారు.

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం రెండో దశ కార్యక్రమాన్ని మెట్టుగూడలో నిర్వహించారు. మెట్టుగూడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, కొత్తగా ఓటు హక్కు పొందేందుకు అర్హులైన వారికి ఫారం-6 అందజేశారు. కొత్త ఓటర్లు ఫారం-6ను సద్వినియోగం చేసుకొని ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు.

ఈ సందర్భంగా ర్యాల రాజేందర్ యాదవ్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడం ప్రజాస్వామ్యంలో ఎంతో ముఖ్యమని అన్నారు. ఓటరు జాబితాలో పేర్లు లేని యువత, కొత్త ఓటర్లు ఫారం-6 ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మొహద్ సాజిద్, కాటినీడి నాగరాజు, అబ్దుల్ మన్నాన్, మహి, పృథ్వీరాజ్, మహిళా నాయకురాళ్లు రూత్ క్లారి, కస్తూరి, సంతోషి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →

విద్యతో పాటు విలువలను పెంపొందించుకోవాలి: బండారు దత్తాత్రేయ

విద్యతో పాటు విలువలను పెంపొందించుకోవాలి: బండారు దత్తాత్రేయ

విద్యతో పాటు విలువలను పెంపొందించుకోవాలి -హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు హైదరాబాద్, రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబర్ 21: విద్యతో పాటు విలువలను పెంపొందించు

మిగతా చదవండి →