ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

కవిసాయంత్రం ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ తెలుగు భాషకు పూర్వవైభవం రావాలి: మామిడి హరికృష్ణ

BC Study Circle Director Mamidi Harikrishna stressed the need to restore Telugu's past glory during Kavisayanthram's 11th-anniversary celebrations in Secunderabad.

nagendra26 August 2026, 2:53 AM8 చూసులుtrinetnews.com
కవిసాయంత్రం ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ  తెలుగు భాషకు పూర్వవైభవం రావాలి: మామిడి హరికృష్ణ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

సికింద్రాబాద్: మారుతున్న యాంత్రిక జీవన విధానం కారణంగా తెలుగు భాష నిరాదరణకు గురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కవిసాయంత్రం వంటి సాహిత్య సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలతో తెలుగు భాష, సాహిత్యానికి పూర్వవైభవం తిరిగి వస్తుందని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.

జనజాగృతి సంస్థలో అంతర్భాగమైన కవిసాయంత్రం సోషల్ మీడియా గ్రూప్ 11వ వార్షికోత్సవ వేడుకలు సికింద్రాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పుస్తకాలను ఆవిష్కరించడంతో పాటు కవులు, రచయితలను ఘనంగా సన్మానించారు.

జనజాగృతి సంస్థ అధ్యక్షుడు ముక్కెర సంపత్ కుమార్ రచించిన ప్రశ్నాస్త్రం, ప్రణయ గీతం కవితా సంకలనాలను, బోయిన భాస్కర్ రచించిన గడ్డిపువ్వు కథా సంపుటిని, పొలగాని భాను తేజశ్రీ రచించిన ప్రతినిధి వ్యాస సంకలనాన్ని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలుగు భాష, సాహిత్య పరిరక్షణకు కవులు, రచయితలు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. సామాజిక మాధ్యమాలను సైతం సాహిత్య ప్రచారానికి వేదికగా మలచడం అభినందనీయమని పేర్కొన్నారు.

రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ గాజుల శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా కవిసాయంత్రం సోషల్ మీడియా వేదికగా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. యువతలో తెలుగు భాషపై ఆసక్తిని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో గద్దర్ ఫిలిం అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్ర, ప్రముఖ కవులు మౌనశ్రీ మల్లిక్, డా. పొన్నాల బాలయ్య, సిరీన్ వ్యాలీ అధినేత మాడ్గుల ప్రభాకర్ రెడ్డి, నూకల అశోక్ యాదవ్, కవులు కవిత బేతి, అత్తలూరి రామకృష్ణ, కడారి సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, అమెరికా తదితర ప్రాంతాల నుంచి పలువురు కవులు, సాహితీవేత్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇవి కూడా చదవండి

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →

విద్యతో పాటు విలువలను పెంపొందించుకోవాలి: బండారు దత్తాత్రేయ

విద్యతో పాటు విలువలను పెంపొందించుకోవాలి: బండారు దత్తాత్రేయ

విద్యతో పాటు విలువలను పెంపొందించుకోవాలి -హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు హైదరాబాద్, రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబర్ 21: విద్యతో పాటు విలువలను పెంపొందించు

మిగతా చదవండి →