ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

ఎన్నికల అఫిడవిట్ లో కల్వకుంట్ల ముఠా అడ్డంగా దొరికిపోయింది త్యాగాల పునాదుల మీద కల్వకుంట్ల కుటుంబం లక్ష కోట్ల ఆస్తులను దోచుకుంది

Revenue Minister Ponguleti Srinivas Reddy accused the Kalvakuntla family of amassing assets worth lakhs of crores through land grabbing.

nagendra17 September 2026, 11:27 PM0 చూసులుtrinetnews.com
ఎన్నికల అఫిడవిట్ లో కల్వకుంట్ల ముఠా అడ్డంగా దొరికిపోయింది   త్యాగాల పునాదుల మీద కల్వకుంట్ల కుటుంబం లక్ష కోట్ల ఆస్తులను దోచుకుంది

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

-రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 17: ఎన్నికల అఫిడవిట్ లో కల్వకుంట్ల ముఠా అడ్డంగా దొరికిపోయిందని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సున్నా ఎకరాల నుండి వేల కోట్ల విలువైన ఆస్తులకు ఎదిగిన భూ బకాసురుడు కేసీఆర్ అని మంత్రి విమర్శించారు. తనకు ఒక్క ఎకరం కూడా భూమి లేదని 2004 కరీంనగర్ లోక్ సభ ఎన్నికల అఫిడవిట్లో తెలిపిన కేసీఆర్ కు ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయని మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్ పుట్టుకతోనే వందల ఎకరాలు భూస్వామ్య కుటుంబంలో జన్మించారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. గతంలో కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్ ను ఎక్స్ లో షేర్ చేస్తూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తరువాత అధికారంలో ఉన్న పదేండ్లలో కేసీఆర్కు భూములు భారీగా పెరిగిన విషయం, స్వయంగా కేసీఆర్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ద్వారా స్పష్టమవుతుందన్నారు.

బొంకుతున్నా కేటీఆర్

బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమకారులకు అప్పులు మిగిలితే కేసీఆర్ కుటుంబానికి మాత్రం లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయని మంత్రి నిలదీశారు. ఇదంతా ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూములను దోచుకోవడం ద్వారానే కదా అని ప్రశ్నించారు. ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద కల్వకుంట్ల కుటుంబంలక్షల కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించుకుంటే డ్రామారావు (కేటీఆర్) మాత్రం పుట్టుకతోనే కేసీఆర్కు వందల ఎకరాలు ఉన్నాయని బొంకుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పులు రాసి మోసం చేసారా? లేక, ప్రజలకు అబద్దాలు చెప్తున్నారా అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిలదీశారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →