ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

మట్టి వినాయకులనే ప్రతిష్టిద్దాం - పర్యావరణాన్ని పరిరక్షిద్దాం రాజయోగి డాక్టర్ చిక్కా దేవదాసు

Global environmentalist Dr. Chikka Devadasu urged citizens to celebrate Vinayaka Chaviti with eco-friendly clay idols to protect water bodies.

nagendra11 September 2026, 12:46 AM1 చూసులుtrinetnews.com
మట్టి వినాయకులనే ప్రతిష్టిద్దాం - పర్యావరణాన్ని పరిరక్షిద్దాం   రాజయోగి డాక్టర్ చిక్కా దేవదాసు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబరు 10,

వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూనే మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రపంచ పర్యావరణ, ప్రకృతి ప్రేమికుడు, శతాధిక అవార్డుల గ్రహీత రాజయోగి డాక్టర్ చిక్కా దేవదాసు దేశ ప్రజలకు పిలుపునిచ్చారు

పారంపర్యంగా మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను పూజించడం మన భారతీయ సంస్కృతిలో భాగమని మట్టి వినాయక విగ్రహాలు నీటిలో సులభంగా కలిసి పోవడంతో చెరువులు, కుంటలు, నదులు కలుషితం కాకుండా ఉంటాయని చిక్కా దేవదాసు అన్నారు

ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులకు, జలచరాలకు హాని కలిగే అవకాశం ఉందని అందువల్ల ప్రజలు మట్టి వినాయక విగ్రహాలని కొనుగోలు చేసి పూజించాలని, రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నివారించాలని చిక్కా దేవదాసు కోరారు. వినాయకుని పండుగ రోజులలో ఇండ్లలో మండపాల వద్ద ప్రతి ఒక్కరూ చేనేత కండువాలు చేనేత దుస్తులు ధరించాలని,

పర్యావరణహితమైన సహజ రంగులతో అలంకరించిన మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం ద్వారా స్థానిక కళాకారులు, ఉత్పత్తి కులాలకు కూడా ఉపాధి లభిస్తుందని చిక్కా దేవదాసు తెలిపారు.

మట్టి వినాయకుడు మన సంప్రదాయానికి ప్రతీక, పర్యావరణానికి రక్షణ కవచం కనుక భక్తి పేరుతో ప్రకృతికి హాని చేయకుండా, భక్తితో పాటు బాధ్యతను కూడా పాటించాలని మన చెరువులు, కుంటలు, నదులను పరిశుభ్రంగా ఉంచి భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలని చిక్కా దేవదాసు అన్నారు

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →