ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

దళిత బంధు పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలి..

Dalit Bandhu beneficiaries from Mothkur and Addagudur staged a protest at Osmania University, demanding the immediate release of pending funds.

nagendra2 September 2026, 12:58 AM5 చూసులుtrinetnews.com
దళిత బంధు పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలి..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

* మూడు సంవత్సరాలుగా నిధులు నిలిచిపోయాయి: దళిత బంధు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డా. బుషిపాక గణేశ్..

* ఫ్రీజింగ్ ఎత్తివేసి గ్రౌండింగ్ పూర్తి చేసి రూ.10 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్..

తార్నాక, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 1:

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌ లో ఉన్న దళిత బంధు నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత బంధు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డా. బుషిపాక గణేశ్ ఆధ్వర్యంలో మోత్కూర్, అడ్డగూడూరు మండలాలకు చెందిన దళిత బంధు లబ్ధిదారులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. బుషిపాక గణేశ్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం గత ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. రెండో విడతలో భాగంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.3 లక్షలు జమ చేసిన అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కలెక్టర్లు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారని తెలిపారు. రెండో విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని రాష్ట్ర కార్పొరేషన్ ఎండీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా దళిత బంధు నిధుల సమస్య పరిష్కారం కాలేదని, దీంతో లబ్ధిదారుల కుటుంబాలు అనేక సంక్షేమ పథకాలకు దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బ్యాంకు ఖాతాలపై ఉన్న ఫ్రీజింగ్‌ను ఎత్తివేసి, గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేసి ప్రతి లబ్ధిదారుడి ఖాతాలో మిగిలిన రూ.10 లక్షల దళిత బంధు నిధులను జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఎస్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్ల అజయ్, బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్‌ తో పాటు దళిత బంధు లబ్ధిదారులు జిల్లా శివాజీ, జక్కుల గిరిబాబు, ఇటీకాల అంజన్న, చేడే సైదులు, బాలెంల నరేందర్, శ్రీరామ్‌ల ప్రదీప్, బుషిపాక సంజీవ, బట్ట చిన్న వెంకన్న, మంద విష్ణు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →