ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

మల్లాపూర్‌ లో వైభవంగా వినాయక చవితి వేడుకలు..

Vinayaka Chavithi celebrations are being held on a grand scale under the auspices of the Ekadanta Vinayaka Association in Mallapur.

nagendra20 September 2026, 2:20 AM2 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

నాచారం, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 19: మల్లాపూర్‌ పరిధిలోని ఏకదంతా వినాయక అసోసియేషన్‌ ఆధ్వర్యంలో, అధ్యక్షుడు అచ్చగొని దినేష్‌ గౌడ్‌ నేతృత్వంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. తొలి రోజు నుంచే స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, సహస్రనామార్చనలు నిర్వహిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ భక్తులు గణనాథుడిని దర్శించుకుంటున్నారు. వేడుకల్లో భాగంగా మండప ప్రాంగణంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి మల్లాపూర్‌ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గణనాథుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రంగురంగుల విద్యుత్‌ దీపాలు, పుష్పాలంకరణలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. పలువురు స్థానిక నాయకులు, ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అచ్చగొని దినేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ, లంబోదరుని దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తులందరూ కలసికట్టుగా పాల్గొని వేడుకలను విజయవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు. మండప ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలు, ఆధ్యాత్మిక గీతాలతో మారుమోగుతోంది. మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు భరత్, సందీప్, చరణ్, పృథ్వి, నీలేష్, సునీల్, ఆశిష్, అంచల్, వెంకటేష్, లక్కీతో పాటు పలువురు సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →