ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

బసంతాపురం గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్

Yadadri Bhuvanagiri District Collector inspected the pilot project survey and interacted with locals during a surprise visit to Basanthapur village.

nagendra9 September 2026, 1:57 AM4 చూసులుtrinetnews.com
బసంతాపురం గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి,సెప్టెంబరు08:

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బసంతపురం గ్రామాన్ని మంగళవారం రోజు జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. బసంతాపురం గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద చేస్తున్నటువంటి సర్వే కార్యక్రమాన్ని సందర్శించి సర్వే చేసే విధానాన్ని తెలుసుకోవడం జరిగింది.అలాగే గ్రామంలోని అంగన్వాడి సెంటర్ ని సందర్శించి అంగన్వాడి సెంటర్ విద్యార్థులతో మరియు స్కూలు విద్యార్థులతో మాట్లాడి సదుపాయాలు ఎలా ఉన్నాయని తెలుసుకొని టీచర్లను అభినందించడం జరిగింది.తర్వాత గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థకు మరియు అంగన్వాడీ భవనానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. బసంతాపురం గ్రామ ప్రజలు గ్రామంలో రేషన్ దుకాణం లేనందున పక్క గ్రామమైన కాల్వపల్లికి వెళ్లి తెచ్చుకుంటూ ఇబ్బందులు గురవుతున్నారని సర్పంచ్ మెండు రత్నమాల సత్తిరెడ్డి తెలియజేయడంతో గ్రామానికి రేషన్ దుకాణం మంజూరు చేయాలని సంబంధిత అధికారితో మాట్లాడి హామీ ఇవ్వడం జరిగింది.తదనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు సక్రమంగా జరుగుతూ ఉన్నాయని తెలుసుకున్నాను మరియు సర్వేలో భాగంగా రైతులు అధికారులకు సహకరిస్తున్న విధానం చాలా బాగుంది. ఏలాంటి ఆటంకం లేకుండా సర్వే జరుగుతుందని భావిస్తున్నాను అని మరియు రాజాపేట మండలంలో చిన్న గ్రామమైన బసంతాపురం చాలా ఆదర్శంగా కనిపిస్తుంది. అలాగే మీరు ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయాలి అని సర్పంచ్ ని అభినందించడం జరిగింది. మరియు గ్రామంలోని యువకులు మెండు భాస్కర్ రెడ్డిని మరియు మెండు ఉపేందర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బసంతాపురం గ్రామ సర్పంచ్ మెండు రత్నమాల సత్తిరెడ్డి, ఉపసర్పంచ్ గుల్లపల్లి రాజు గౌడ్ మరియు వార్డు మెంబర్లు మెండు ఉపేందర్ రెడ్డి, వడ్లకొండ మాధవి, గంధ మల్ల కవిత, వడ్లకొండ రాములమ్మ, ములకలపల్లి రమేష్ మరియు గ్రామ పెద్దలు మెండు మధుసూదన్ రెడ్డి, మెండు మహేందర్రెడ్డి,మెండు చిన్నా నరసింహారెడ్డి, మెండు సాయికుమార్ రెడ్డి, గంధమల్ల బాలకృష్ణ గౌడ్, గుల్లపల్లి వినయ్ గౌడ్, వడ్లకొండ మహేష్ బాబు, వివో మెండు పల్లవి,తదితరులు పాల్గొనడం జరిగింది.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →