ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

ట్రాన్స్‌కో ఉద్యోగి కుటుంబానికి రూ.కోటి బీమా చెక్కు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి

Deputy Chief Minister Mallu Bhatti Vikramarka handed over a Rs 1 crore accident insurance check to the family of deceased TG Transco employee Mohammed Mujahid.

nagendra19 September 2026, 2:33 AM1 చూసులుtrinetnews.com
ట్రాన్స్‌కో ఉద్యోగి కుటుంబానికి రూ.కోటి బీమా చెక్కు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

‎హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 18: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన టీజీ ట్రాన్స్‌కో ఉద్యోగి మహమ్మద్ ముజాహిద్ కుటుంబానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రూ. 1 కోటి ప్రమాద బీమా చెక్కును అందజేశారు. అసెంబ్లీలోని తన చాంబర్‌లో మృతుడి తల్లి (నామిని)కి ఈ పరిహారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అందజేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని 132 కేవీ సబ్‌స్టేషన్‌లో జూనియర్ లైన్‌మన్ గా పనిచేస్తున్న మహమ్మద్ ముజాహిద్ (26) 2025 నవంబర్ 5న నైట్ షిఫ్ట్ ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా జరిగినరోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం, టీజీ ట్రాన్స్‌కో ఉద్యోగులకు ఎస్‌బీఐ శాలరీ ప్యాకేజీ కింద కల్పిస్తున్న ప్రమాద బీమా పథకంలో భాగంగా బాధితుడి కుటుంబ సభ్యులు 2026 ఫిబ్రవరిలో క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. శాఖాపరమైన ప్రక్రియ వేగవంతం చేసి, ఆగస్టు 20న రూ. 1 కోటి పరిహారాన్ని మృతుడి తల్లి ఖాతాకు సకాలంలో జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →