ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రజా పాలన.. లాలాపేటలో కాంగ్రెస్ శ్రేణుల సందడి..

Congress leaders and workers in Lalapet celebrated 1,000 days of the Revanth Reddy government, highlighting welfare and development initiatives.

nagendra6 September 2026, 6:41 AM4 చూసులుtrinetnews.com
వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రజా పాలన.. లాలాపేటలో కాంగ్రెస్ శ్రేణుల సందడి..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

* ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం: అమర్నాథ్ గౌడ్..

తార్నాక, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 5 :

టీపిసీసీ, డిసీసీ నాయకులు, సికింద్రాబాద్ ఇంచార్జ్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా లాలాపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. టీపీసీసీ సెక్రెటరీ అమర్నాథ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాణసంచా కాల్చి, కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడంతో పాటు, హామీల్లో ప్రస్తావించని మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, తీసుకున్న తప్పుడు నిర్ణయాల ప్రభావాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై ఆ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని అమర్నాథ్ గౌడ్ ఆరోపించారు. విమర్శలకు మాటలతో కాకుండా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులతోనే సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో నమ్మకం మరింత బలపడుతోందని అన్నారు. కార్యక్రమంలో అనిరుధ్, శేఖర్, బాబా అశోక్, రాజు, ప్రసాద్, శివ సుధాకర్, శైలేందర్, అన్వర్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →