ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంఎంసీ లోగో ఆవిష్కరణ..

Chief Minister A. Revanth Reddy launched the official logo of the newly formed Malkajgiri Municipal Corporation at Amberpet Stadium.

nagendra31 August 2026, 8:08 PM4 చూసులుtrinetnews.com
సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంఎంసీ లోగో ఆవిష్కరణ..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

* 654 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 3 జోన్లు, 14 సర్కిళ్లు, 74 వార్డులతో కార్పొరేషన్‌..

* ప్రజలకు మెరుగైన సేవలు, ఆధునిక మౌలిక వసతులే లక్ష్యంగా ముందుకు..

అంబర్ పేట్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 31

: నూతనంగా ఏర్పాటైన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌ (ఎంఎంసీ) అధికారిక లోగోను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం అంబర్‌పేట్ స్టేడియంలో ఆవిష్కరించారు. కార్పొరేషన్‌ ప్రత్యేకత, పట్టణ అభివృద్ధి, ప్రజా సేవలు, భవిష్యత్‌ దిశను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ లోగో ఎంఎంసీకి అధికారిక ప్రతీకగా నిలవనుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పట్టణ పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా 654 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌ ఏర్పాటైంది. మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీ నగర్‌ జోన్లుగా విభజించి, 14 సర్కిళ్లు, 74 వార్డులతో కార్పొరేషన్‌ విస్తరించింది. 2026 ఫిబ్రవరిలో టి. వినయ్ కృష్ణా రెడ్డి, ఐఏఎస్‌ను కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసింది. పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ, పచ్చదనం, పట్టణ ప్రణాళిక, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంపై ఎంఎంసీ అధికారులు దృష్టి సారిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యం, అధికారుల సమన్వయంతో ఆధునిక, పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన నగరంగా కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం చేతుల మీదుగా లోగో ఆవిష్కరణ ఎంఎంసీ పరిపాలనా చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిందని పేర్కొన్నారు.

[22:06, 2026/8/31] +91 99896 32234: End..

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →