ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

సీఎం క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు చావు డప్పు కొడుతున్నారు: బిఆర్‌ఎస్ నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి

BRS leader Kalluri Ramachandra Reddy demanded that Chief Minister Revanth Reddy apologize for governance failures, stating the public is turning against Congress.

nagendra8 September 2026, 2:02 AM4 చూసులుtrinetnews.com
సీఎం క్షమాపణ చెప్పాలి  కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు చావు డప్పు కొడుతున్నారు: బిఆర్‌ఎస్ నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు07:

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం కాదు, ముందుగా పాలనలో పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ ముందు చావు డప్పు కొడతామంటున్న కాంగ్రెస్ నాయకులు ముందుగా క్షేత్రస్థాయికి వెళ్లి చూడాలని, అక్కడ ప్రజలు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికే చావు డప్పు కొడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.అధికార మత్తులో ఉండి కాంగ్రెస్ నాయకులు ఇంకా మేలుకోలేకపోతున్నారని కల్లూరి రామచంద్ర రెడ్డి విమర్శించారు.ప్రజాసమస్యలపై నిలదీస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.సభకు వస్తున్న మహిళా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీత లక్ష్మారెడ్డి చీర కొంగు లాగి ప్రవర్తించిన పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా అణచివేత ధోరణి వీడి, ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలని, లేని పక్షంలో ప్రజల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →