ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

పేదల పాలిట వరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌..

BRS leaders distributed CMRF checks worth Rs 1,33,500 to beneficiaries in Nacharam and HMT Nagar divisions, facilitated by Uppal MLA Bandari Laxma Reddy.

nagendra10 September 2026, 2:06 AM2 చూసులుtrinetnews.com
పేదల పాలిట వరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

  1. నాచారం, ట్రైనెట్ న్యూస్ , సెప్టెంబర్ 9 :

  2. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ (సీఎంఆర్‌ఎఫ్‌) అండగా నిలుస్తోందని బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. నాచారం, హెచ్‌ఎంటీ నగర్‌ డివిజన్ లకు చెందిన పలువురు ఆర్థిక సాయం కోసం ఉప్పల్‌ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డిని కలిసి దరఖాస్తు చేసుకున్నారు. వారి అభ్యర్థనలను పరిశీలించిన ఎమ్మెల్యే సీఎం కార్యాలయం ద్వారా రిలీఫ్‌ ఫండ్‌ మంజూరయ్యేలా చొరవ తీసుకున్నారు. మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్‌ శేఖర్‌ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బన్నెపాక పరశురాం రూ.42,000, టి. రేఖ రూ.37,500, బి. శశిరేఖ రూ.54,000 చొప్పున చెక్కులు అందజేశారు. మొత్తం రూ.1,33,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →