ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

తప్పిపోయిన వారి కోసం వెతికి.. కుటుంబాల చెంతకు చేర్చిన పోలీసులు..

Chilkalguda police showed great humanity by providing shelter to two lost elderly women and successfully reuniting them with their families.

nagendra2 September 2026, 1:04 AM7 చూసులుtrinetnews.com
తప్పిపోయిన వారి కోసం వెతికి.. కుటుంబాల చెంతకు చేర్చిన పోలీసులు..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

* ఆశ్రయం కల్పించి ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు..

* పత్రికల్లో వచ్చిన ఫొటోలతో కుటుంబ సభ్యుల గుర్తింపు..

చిలకలగూడ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 1: దిక్కుతోచని స్థితిలో ఉన్న ఇద్దరు వృద్ధ మహిళలకు చిలకలగూడ పోలీసులు అండగా నిలిచారు. తప్పిపోయిన వారిని కేవలం గుర్తించడమే కాకుండా, వారి కుటుంబ సభ్యుల చెంతకు క్షేమంగా చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆగస్టు 31న చిలకలగూడ పోలీసుల పరిధిలో కనిపించిన బాలమణి, గోవిందమ్మలను ముందుగా డ్రీమ్ ఇండియా హోమ్‌లో ఆశ్రయం కల్పించారు. అనంతరం వారి వివరాలు, ఫొటోల ఆధారంగా కుటుంబ సభ్యుల కోసం పోలీసులు ఆరా తీశారు. పోలీసుల ప్రయత్నాలకు ఫలితం దక్కింది. గోవిందమ్మ కుటుంబ సభ్యులు సమాచారం అందుకుని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆమెను గుర్తించి ఇంటికి తీసుకెళ్లారు. మరోవైపు వికారాబాద్‌ కు చెందిన బాలమణి ఫొటోను పత్రికల్లో చూసిన కుటుంబ సభ్యులు చిలకలగూడ పోలీసులను సంప్రదించారు. వివరాలను పరిశీలించి గుర్తింపును నిర్ధారించిన పోలీసులు డ్రీమ్ ఇండియా హోమ్ నుంచి బాలమణిని తీసుకొచ్చి ఆమె బంధువులకు అప్పగించారు. ఇన్‌స్పెక్టర్ వలిశెట్టి రామకృష్ణ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ పూస శ్రీనివాస్ ప్రత్యేక చొరవ చూపి ఇద్దరు మహిళలు తిరిగి తమ కుటుంబాలను చేరుకునేలా చర్యలు చేపట్టారు. ఎన్నో ఆందోళనల తర్వాత తమ వారిని సురక్షితంగా తిరిగి చూసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనలో చిలకలగూడ పోలీసులు చూపిన చొరవ, ఆప్యాయతకు స్థానికుల నుంచి అభినందనలు వ్యక్తమయ్యాయి.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →