ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్ద నిరసనను ఖండించిన బీఆర్‌ఎస్‌వీ, మాదిగ జేఏసీ..

BRSV and OU Madiga JAC leaders staged a protest at Osmania University condemning the demonstration held by Congress leaders at KCR's farmhouse.

nagendra13 September 2026, 2:55 AM2 చూసులుtrinetnews.com
కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్ద నిరసనను ఖండించిన బీఆర్‌ఎస్‌వీ, మాదిగ జేఏసీ..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఓయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద విద్యార్థి నేతల నిరసన.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు..

ఉస్మానియా యూనివర్సిటీ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 12 :

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ వద్ద కాంగ్రెస్‌ నాయకులు నిర్వహించిన నిరసనను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్‌ఎస్‌వీ, ఓయూ మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్‌, ఓయూ మాదిగ జేఏసీ చైర్మన్‌ బుసిపాక గణేష్‌ మాదిగ ఆధ్వర్యంలో ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో ర్యాలీ నిర్వహించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొంపల్లి నరేష్‌, గణేష్‌ మాదిగ మాట్లాడుతూ దళితులు, మాదిగల అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదన్నారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్ద చావు డప్పులతో నిరసన చేపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ పిలుపుతో దళితులు, మాదిగ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్‌ హయాంలో పలువురు మాదిగ విద్యార్థి నాయకులకు రాజకీయ, రాష్ట్రస్థాయి పదవుల్లో అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో తీవ్రంగా ప్రతిఘటిస్తామని విద్యార్థి నేతలు హెచ్చరించారు. దళిత విద్యార్థుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శులు కొండా గణేష్‌, గంగధార వెంకట్‌, అర్జున్‌, గోపి, సాయి, సాయికిరణ్‌, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →