ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

గ్రామీణ నిరుద్యోగానికి పరిశ్రమలు–యువత అనుసంధానమే పరిష్కారం సెప్టెంబర్‌ 19న కోదాడలో మెగా జాబ్‌మేళా

Minister Uttam Kumar Reddy announced that a mega job mela will be held in Kodad on September 19, featuring over 300 companies and offering more than 3,500 jobs to rural youth.

nagendra16 September 2026, 2:26 AM5 చూసులుtrinetnews.com
గ్రామీణ నిరుద్యోగానికి పరిశ్రమలు–యువత అనుసంధానమే పరిష్కారం  సెప్టెంబర్‌ 19న కోదాడలో మెగా జాబ్‌మేళా

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

300 కంపెనీలకు ఆహ్వానం.. 3,500 మందికి పైగా యువతకు ఉద్యోగావకాశాలు

ఎంపికైన అభ్యర్థులకు అక్కడికక్కడే ఆఫర్‌ లెటర్లు

ఆఫర్‌ లెటర్లు అందజేయనున్న పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

-మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట జిల్లా బ్యూరో సెప్టెంబర్‌ 15:

గ్రామీణ ప్రాంతాల్లోని విద్యావంతులైన నిరుద్యోగ యువతకు, ప్రముఖ పారిశ్రామిక సంస్థలకు మధ్య బలమైన, నిరంతర అనుసంధానం ఏర్పడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ యువతలో ప్రతిభకు కొదవ లేకపోయినా, సంఘటిత రంగంలోని ఉద్యోగావకాశాలను అందుకునేందుకు సరైన వేదిక లేకపోవడమే ప్రధాన సమస్యగా మారిందన్నారు. ఈ అంతరాన్ని తొలగించేందుకు ప్రభుత్వం వ్యవస్థీకృత కార్యాచరణతో ముందుకు సాగుతోందని తెలిపారు. సెప్టెంబర్‌ 19న కోదాడలో నిర్వహించనున్న మెగా జాబ్‌మేళా ఏర్పాట్లపై మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంపెనీల ప్రతినిధులు, విద్యాసంస్థల ప్రతినిధులు, స్థానిక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యావంతులైన యువతలో నిరుద్యోగం సమాజాన్ని వేధిస్తున్న అత్యంత తీవ్రమైన సమస్యల్లో ఒకటని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువత పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందన్నారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ, డిగ్రీతోపాటు వివిధ వృత్తి విద్యాకోర్సులు చదివించేందుకు తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థోమతకు మించి ఖర్చు చేస్తున్నప్పటికీ, చదువు పూర్తయిన తరువాత పిల్లలకు తగిన ఉద్యోగాలు లభించక తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, టీపీసీసీ అధ్యక్షుడిగా తన సుదీర్ఘ ప్రజాజీవితంలో ఇటువంటి తల్లిదండ్రులను అనేకమందిని కలిశానని గుర్తు చేశారు. గ్రామంలో చదివిన ఇంజినీరింగ్‌ లేదా వృత్తి విద్యా పట్టభద్రుడికి హైదరాబాద్‌లో నివసించే యువకుడితో సమానంగా ప్రముఖ కంపెనీలను సంప్రదించే అవకాశం ఉండదని పేర్కొన్నారు. ఉద్యోగ ఖాళీల వివరాలు తెలుసుకోవడం, పేరొందిన సంస్థలను సంప్రదించడం, పదేపదే హైదరాబాద్‌కు ప్రయాణించడం, ఇంటర్వ్యూలకు హాజరుకావడం గ్రామీణ యువతకు ఆర్థికంగా, సామాజికంగా పెద్ద సవాల్‌గా మారుతోందన్నారు. గ్రామీణ యువత ప్రముఖ కంపెనీల వద్దకు సులభంగా చేరుకోలేకపోతే, ఆ కంపెనీలనే గ్రామీణ యువత ముంగిటకు తీసుకురావాలి. అదే కోదాడ మెగా జాబ్‌మేళా ప్రధాన ఉద్దేశం అని స్పష్టం చేశారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, విద్యాసంస్థలు అందిస్తున్న అర్హతలు, యువతలో ఉన్న ప్రతిభ—ఈ మూడింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ జాబ్‌మేళా అని తెలిపారు. ఒకే ప్రాంగణంలో అనేక సంస్థల ప్రతినిధులను కలిసి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం గ్రామీణ నిరుద్యోగులకు కల్పించనున్నట్లు చెప్పారు. అభ్యర్థుల విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఒక్కొక్కరికి ఐదు సంస్థల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోదాడ జాబ్‌మేళాకు సుమారు 300 కంపెనీలను ఆహ్వానించినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌తోపాటు వివిధ పారిశ్రామిక ప్రాంతాలకు చెందిన ప్రముఖ సంస్థలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిశ్రమలను ఇందులో భాగస్వాములను చేస్తున్నట్లు వివరించారు.

అపోలో గ్రూప్‌, జీఎంఆర్‌, రాంకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రాతోపాటు సిమెంట్‌, తయారీ, సేవలు, ఐటీ, ఫార్మా, నిర్మాణ, వ్యాపార రంగాలకు చెందిన అనేక ప్రముఖ సంస్థలను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. స్థానికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి పరిశ్రమ జాబ్‌మేళాలో పాల్గొనేలా పరిశ్రమల శాఖ అధికారులు వ్యక్తిగతంగా సంప్రదించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమల శాఖ, సింగరేణి సంస్థ సమన్వయంతో ఈ నియామక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జాబ్‌మేళా ద్వారా 3,500 మందికి పైగా యువతకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. ఇంటర్వ్యూలలో ఎంపికైన అభ్యర్థులకు సాధ్యమైనంత వరకు జాబ్‌మేళా ప్రాంగణంలోనే ఆఫర్‌ లెటర్లు అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్‌ లెటర్లు అందజేస్తారని వెల్లడించారు.

జాబ్‌మేళాపై ఇప్పటికే సుమారు లక్షన్నర మంది ఉద్యోగార్థులకు బల్క్‌ సందేశాలు పంపించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్న క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. పత్రికా ప్రకటనలు, కరపత్రాలు, పోస్టర్లు, సామాజిక మాధ్యమాల ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను గ్రామస్థాయి వరకు చేరవేస్తున్నట్లు తెలిపారు.

జాబ్ మేళా కు పకడ్బందీ ఏర్పాట్లు

జాబ్‌మేళాకు పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్‌, పార్కింగ్‌కు సంబంధించి పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రధాన వేదికకు ఇరువైపులా సుమారు 200 మీటర్ల వరకు వాహనాల రాకపోకలను నియంత్రించి, అభ్యర్థులు సులభంగా నడిచి వెళ్లేందుకు అనువైన పరిస్థితులు కల్పించాలని సూచించారు. కంపెనీల ప్రతినిధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతోపాటు రవాణా, వసతి, భోజన సదుపాయాల సమన్వయ బాధ్యతలను కోదాడ, హుజూర్‌నగర్‌, సూర్యాపేట ఆర్డీఓలకు అప్పగించినట్లు తెలిపారు. కోదాడ మెగా జాబ్‌మేళా కేవలం ఒక్కరోజు నిర్వహించే నియామక కార్యక్రమంగా మిగిలిపోకూడదని, గ్రామీణ ప్రతిభను విద్యాసంస్థలు, సంఘటిత పారిశ్రామిక రంగంతో అనుసంధానించే శాశ్వతమైన, ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయగల ఆదర్శ నమూనాగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. తరగతి గది నుంచి ఇంటర్వ్యూ గదికి, అక్కడి నుంచి ఉద్యోగ నియామక పత్రం వరకు యువత ప్రయాణాన్ని ఒకే వేదికపై సాకారం చేయడమే ఈ జాబ్‌మేళా లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే ఎన్‌. పద్మావతిరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, జిల్లా ఎస్పీ కె. నరసింహ లతోపాటు వివిధ శాఖల అధికారులు, విద్యాసంస్థలు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →