ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

విద్యార్థుల ఫీజు బకాయిల విడుదలకు బీజేపీ అసెంబ్లీ ముట్టడి..

BJP leaders and cadres staged a protest laying siege to the Assembly, demanding the immediate release of pending fee reimbursement and scholarships.

nagendra8 September 2026, 1:39 AM5 చూసులుtrinetnews.com
విద్యార్థుల ఫీజు బకాయిల విడుదలకు బీజేపీ అసెంబ్లీ ముట్టడి..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

* భరత్ గౌడ్ నాయకత్వంలో నిరసన.. భారీగా పాల్గొన్న బీజేపీ శ్రేణులు..

* నాయకులు, కార్యకర్తల అరెస్ట్.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలింపు..

సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 7 :

విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌ షిప్‌ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ భరత్ గౌడ్ నాయకత్వంలో బీజేపీ శ్రేణులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ నిరసనలో జిల్లా నాయకులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయినప్పటికీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం బీజేపీ శ్రేణులు నిరసన కొనసాగించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, విద్యార్థుల ఫీజు బకాయిలు, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీరామ్ వెంకట్, నందు, హరి, గడ్డం నవీన్, శారద, తార్నాక డివిజన్ బీజేపీ అధ్యక్షులు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →