ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీపై ఆటో, క్యాబ్ సంఘాల జేఏసీ ఆగ్రహం..

Discussions at RTC Bhavan turned chaotic as multiple labor unions boycotted the meeting over the proposed integration of autos and cabs with RTC and Metro services.

nagendra6 September 2026, 6:38 AM5 చూసులుtrinetnews.com
ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీపై ఆటో, క్యాబ్ సంఘాల జేఏసీ ఆగ్రహం..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

* ఆర్టీసీ భవన్‌లో చర్చలు రసాభాస.. సమావేశాన్ని బహిష్కరించిన పలు కార్మిక సంఘాలు..

ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 5 :

ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఆర్టీసీ, మెట్రో సేవలకు ఆటోలు, క్యాబ్‌లను అనుసంధానం చేసే ప్రతిపాదనను ఆటో, యాప్‌ ఆధారిత రవాణా సంఘాల జేఏసీ తీవ్రంగా వ్యతిరేకించింది. శనివారం ఆర్టీసీ భవన్‌లో రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మీసేవ కమిషనర్ రవికిరణ్‌ లతో జరిగిన సమావేశంలో దీనిపై వాగ్వాదం చోటుచేసుకుంది. మీసేవ ద్వారా ఒకే టికెట్‌తో బస్సు, మెట్రో, ఆటోలో ప్రయాణించే విధానాన్ని ఆర్టీసీ ఎండీ ప్రతిపాదించగా, రవాణా శాఖ కమిషనర్ దాని వివరాలను వెల్లడించారు. అయితే జేఏసీ నాయకుడు రవిశంకర్ మాట్లాడుతూ.. ఆగస్టు 23న రవాణా శాఖ మంత్రి, కమిషనర్‌తో జరిగిన చర్చల్లో ఆర్టీసీలో ఆటో కనెక్టివిటీ ప్రతిపాదన లేదని లిఖితపూర్వకంగా తెలిపి, ఇప్పుడు ప్రతిపాదన ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్ల జీవనోపాధి విషయంలో మూడో వ్యవస్థ మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు.

జేఏసీ నాయకులు మారయ్య, వెంకటేశం మాట్లాడుతూ ఆటో మీటర్ ఛార్జీల పెంపు, సంక్షేమ బోర్డు జీఓపై చర్చించాల్సి ఉండగా కనెక్టివిటీపై సమావేశం నిర్వహించడం సరికాదన్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో వైట్‌ప్లేట్ బైక్‌లను సీజ్ చేయాలని మల్లేష్ గౌడ్, ప్రవీణ్ సలీం డిమాండ్ చేశారు. ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ బీఎంఎస్, బీఆర్‌టీయూ, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీఐ, ఐఎఫ్‌టీయూ, బీఆర్‌ఎస్ నాయకులు సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం జేఏసీ నేతలు ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సమ్మె చేపడతామని జేఏసీ నేతలు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →