ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

జర్నలిస్టుల ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం 2025 ఉత్తమ జర్నలిస్టు అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం – 12 విభాగాల్లో పురస్కారాలు రూ.2 లక్షల నుంచి రూ.1 లక్ష వరకు నగదు పురస్కారాలు – సెప్టెంబరు 28లోగా దరఖాస్తులు కొరబడుతున్నాయి. రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్

The Andhra Pradesh government has announced the 2025 Best Journalist Awards across 12 categories, carrying cash prizes ranging from Rs 1 lakh to Rs 2 lakh. Eligible journalists can submit their applications until September 28.

nagendra6 September 2026, 6:44 AM14 చూసులుtrinetnews.com
జర్నలిస్టుల ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం  2025 ఉత్తమ జర్నలిస్టు అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం – 12 విభాగాల్లో పురస్కారాలు  రూ.2 లక్షల నుంచి రూ.1 లక్ష వరకు నగదు పురస్కారాలు – సెప్టెంబరు 28లోగా దరఖాస్తులు కొరబడుతున్నాయి.  రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

(బై రాజా పెంటపాటీ బ్యూరో చీఫ్ ట్రైనెట్ ఏపీ)

అమరావతి సెప్టెంబర్ 5 ట్రైనెట్

జర్నలిజం రంగంలో విశేష సేవలందిస్తూ, వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి, వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ అవార్డులకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హులైన జర్నలిస్టులు తమ దరఖాస్తులను 2026 సెప్టెంబరు 28వ తేదీ సాయంత్రం 5.00 గంటల్లోగా పంపవలసి ఉంటుంది.

డైరెక్టర్,

సమాచార పౌరసంబంధాల శాఖ,

2వ అంతస్తు, ఎన్టీఆర్ పరిపాలన భవనం,

పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్,

విజయవాడ – 520013.

కింది మూడు పురస్కారాలకు జర్నలిస్టుల నుంచి ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరించకుండా, ఎంపిక కమిటీ తన విచక్షణాధికారంతో పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తుంది.

1. వి.ఆర్. నార్ల జీవిత సాఫల్య పురస్కారం

2. కొక్కు అహోబలరావు ఉత్తమ ఫోటో జర్నలిస్టు అవార్డు

3. మద్దూరి అన్నపూర్ణయ్య పేరిట రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా వార్తాపత్రికల సంపాదకులకు అందించే అవార్డు

దరఖాస్తుల ఆధారంగా కమిటీ ఎంపిక చేసే అవార్డులు

1. కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు ఉత్తమ జర్నలిస్టు అవార్డు

నగదు పురస్కారం: రూ.2 లక్షలు

అర్హతలు:

జర్నలిజం వృత్తిలో కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగి, వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పూర్తికాలపు జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రచురితమవుతున్న పేరొందిన తెలుగు, ఆంగ్ల వార్తాపత్రికలు లేదా పీరియాడికల్స్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌లో లేదా రాష్ట్రం వెలుపల పనిచేస్తున్న జర్నలిస్టులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

2. ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డులు

గ్రామీణ జర్నలిజంలో విశేష ప్రతిభ కనబరిచిన ముగ్గురు జర్నలిస్టులకు ప్రముఖ పాత్రికేయుల పేర్లతో మూడు అవార్డులు అందజేస్తారు.

- ఖాసా సుబ్బారావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డు

- ముట్నూరి కృష్ణారావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డు

- మద్దుకూరి చంద్రశేఖరరావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డు

ఒక్కో అవార్డు నగదు పురస్కారం: రూ.1 లక్ష

అర్హతలు:

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రచురితమవుతున్న తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగిన పాత్రికేయులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గ్రామీణ రిపోర్టింగ్‌లో విశేష అనుభవం గడించిన మాజీ జర్నలిస్టులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

3. సావిత్రిబాయి పూలే ఉత్తమ మహిళా జర్నలిస్టు అవార్డు

నగదు పురస్కారం: రూ.1 లక్ష

అర్హతలు:

రాష్ట్రంలో వెలువడే తెలుగు, ఆంగ్ల వార్తాపత్రికలు లేదా పీరియాడికల్స్‌లో పనిచేస్తున్న మహిళా రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

4. ఉత్తమ కార్టూనిస్టు అవార్డు

నగదు పురస్కారం: రూ.1 లక్ష

అర్హతలు:

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రచురితమవుతున్న తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో పనిచేస్తున్న కార్టూనిస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

5. అబుల్ కలాం ఆజాద్ ఉత్తమ ఉర్దూ జర్నలిస్టు అవార్డు

నగదు పురస్కారం: రూ.1 లక్ష

అర్హతలు:

ఉర్దూ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేస్తూ కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉర్దూ జర్నలిజానికి అందించిన సేవలు, గ్రామీణ ప్రాంతాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై చేసిన రిపోర్టింగ్‌, మొత్తం వృత్తిపరమైన పనితీరును ప్రామాణికంగా తీసుకుని అవార్డు గ్రహీతను ఎంపిక చేస్తారు.

6. ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అవార్డు

నగదు పురస్కారం: రూ.1 లక్ష

అర్హతలు:

కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రసారమయ్యే ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లు, కేబుల్ నెట్‌వర్క్‌లలో పనిచేస్తున్న జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు. దూరదర్శన్‌, రేడియోలో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

7. ఉత్తమ వీడియో జర్నలిస్టు అవార్డు

నగదు పురస్కారం: రూ.1 లక్ష

అర్హతలు:

కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి, ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లలో పనిచేస్తున్న వీడియో జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం – ముఖ్య నిబంధనలు

* జర్నలిస్టులు తాము పనిచేస్తున్న సంస్థ, ఉద్యోగ వివరాలు, తమ అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలతో వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలి.

* దరఖాస్తుతో పాటు కనీసం 5 వ్యాసాలు, వార్తా కథనాలు, ఫొటోలు, కార్టూన్లు లేదా వీడియో క్లిప్పింగ్స్‌ జతచేయాలి. అవి 2025 క్యాలెండర్ సంవత్సరంలో (01-01-2025 నుంచి 31-12-2025 వరకు) ప్రచురితమైనవి/ప్రసారమైనవి అయి ఉండాలి.

* వ్యాసాలు, వార్తా కథనాలు తదితర ఆర్టికల్స్‌ను ఫొటోకాపీల రూపంలో కూడా దాఖలు చేయవచ్చు.

* అవార్డు గ్రహీతల ఎంపికకు సంబంధించి ఎంపిక కమిటీదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు అనుమతించబడవు.

* ఏదైనా విభాగంలో తగిన సంఖ్యలో లేదా తగిన ప్రమాణాలతో దరఖాస్తులు అందలేదని కమిటీ భావించినట్లయితే, సంబంధిత అవార్డును ప్రకటించకుండా నిలిపివేసే అధికారం ఎంపిక కమిటీకి ఉంటుంది.

* ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలోని మీడియా రిలేషన్స్ వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు: (https://mediarelations.ap.gov.in/media)

రాజా పెంటపాటీ ట్రైనెట్ అమరావతి

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →