ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

సాంస్కృతికం

అద్భుతమైన సాహితీమూర్తి వెంకట్ నాగం: ఆచార్య కొలకలూరి ఇనోక్

అద్భుతమైన సాహితీమూర్తి వెంకట్ నాగం: ఆచార్య కొలకలూరి ఇనోక్ ...... హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 18 : తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన రచయిత వెంకట్ నాగం ఒక అద్భుతమైన సాహితీమూర్తి అని ప్రముఖ రచయిత, శ్రీ వెంకటేశ్వర వి

Staff Reporter18 August 2026, 1:52 PM53 చూసులుtrinetnews.com
అద్భుతమైన సాహితీమూర్తి వెంకట్ నాగం: ఆచార్య కొలకలూరి ఇనోక్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

అద్భుతమైన సాహితీమూర్తి వెంకట్ నాగం: ఆచార్య కొలకలూరి ఇనోక్ ...... హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 18 : తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన రచయిత వెంకట్ నాగం ఒక అద్భుతమైన సాహితీమూర్తి అని ప్రముఖ రచయిత, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనోక్ అన్నారు.

మంగళవారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో రచయిత వెంకట్ నాగం రచించిన "రచ్చబండ చర్చలు", "కలగూర గంప" పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం గానసభ అధ్యక్షుడు కళావిఎస్ జనార్దనమూర్తి అధ్యక్షతన జరిగింది.

ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ కాలం రచయితగా, నిక్కచ్చిగా వ్యాసాలు రాసే నిఖార్సయిన విశ్లేషకుడిగా ఆయన సమాజానికి దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. వెంకట్ నాగం రాసిన ప్రతి వ్యాసం ఎంతో తృప్తిగా, ఆనందంగా, అంకితభావంతో రాసినట్లుగా స్పష్టమవుతుందని తెలిపారు. కళలు, సాహిత్యం, సమాజ పోకడలపై ఆయన చూపిన నిక్కచ్చితనం, సత్యసంధత పాఠకులను ఆలోజింపజేస్తాయని వివరించారు.

సభను ప్రారంభించిన తెలుగు అకాడమీ చైర్మన్ ఆచార్య కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ మాతృభాషపై ఉన్న మక్కువతో రచయిత వెంకట్ నాగం "భాషను అభివృద్ధి చేయాలి", "రక్షించుకోవాలి" అనే రెండు విశిష్టమైన గ్రంథాలను రచించడం అభినందనీయమని కూరపాటి వెంకటనారాయణ పేర్కొన్నారు. మాతృభాషలో సమాజానికి ఉపయోగపడే అనేక అంశాలపై పుస్తకాలను తీసుకురావడం శుభపరిణామమని ఆయన అన్నారు. రోజురోజుకూ విధ్వంసమవుతున్న సామాజిక విలువలను పరిరక్షించుకోవడానికి, తెలుగు భాషా వికాసానికి ఇటువంటి పుస్తకాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. మాతృభాషను కాపాడుకుంటూ, తదుపరి తరాలకు అందించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

కార్యక్రమంలో వంశీ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ వంశీ రామరాజు పాల్గొన్నారు. రచయిత వెంకట్ నాగం మాట్లాడుతూ తన పుస్తకాల వెనుక ఉన్న భావజాలాన్ని, రచనలోని అనుభవాలను సభతో పంచుకున్నారు. కాగా కలగూర గంప గ్రంథాన్ని ఆచార్య కొలకలూరి ఇనాక్ కు రచయిత వెంకట్ అంకితమిచ్చారు. సభా కార్యక్రమానికి ముందు సంయుక్త చే సంగీత విభావరీ, అనంతరం నిప్పాని వెంకట రత్నమాల చే సంగీత నృత్య కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా అలరించాయి.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం అప్లికేషన్ ప్రక్రియ ,పథకం అమలుపై చర్చ బీసీ గురుకులాలు, హాస్టల్ ల పనితీరుపై చర్చ

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం అప్లికేషన్ ప్రక్రియ ,పథకం అమలుపై చర్చ   బీసీ గురుకులాలు, హాస్టల్ ల పనితీరుపై చర్చ

Transport and BC Welfare Minister Ponnam Prabhakar held a high-level review meeting on the application process for the 'Intinta Indiramma Sewing Machines' scheme and the functioning of BC residential schools and hostels.

మిగతా చదవండి →